SKLM: కాశీబుగ్గ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించి వారికి తోడ్పాటు అందించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి హరిబాబు సూచించారు. జిల్లా రాగోలులోని ఆసుపత్రిని ఆకస్మికంగా ఆయన ఇవాళ సందర్శించారు. కాశీబుగ్గ దుర్ఘటన క్షతగాత్రులను హరిబాబు పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు.