KRNL: జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ – క్రాప్ నమోదు పక్కాగా జరగాలని ఆదేశించారు. మిరప పంటకు ముడత వ్యాధి వ్యాపిస్తున్నందున, రైతులకు నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. పత్తి, శనగలు, కందులు పంటల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.