AP: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ కోర్టులో విచారణ జరిగింది. ఎక్సైజ్ పోలీసులు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వ్యతిరేకంగా రమేష్, రాము బెయిల్ కోరుతూ విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 11కు కోర్టు వాయిదా వేసింది.