CTR: సోమల మండలంలోని పేటూరు పంచాయతీలో పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 195 పశువులకు పిడుదల నివారణ మందు పిచికారి, 32 దూడలకు నట్టల నివారణ మందు పంపిణీ, 34 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స అందించినట్టు ఏపీడి డాక్టర్ శ్రీనివాస నాయుడు తెలిపారు. అనంతరం పశువుల వ్యాధుల నివారణపై డాక్టర్ చందన ప్రియ అవగాహన కల్పించారు.