TG: జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితమే జీవో కూడా విడుదలైందని పిటిషనర్లు తెలిపారు. దీంతో ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది.