ADB: పత్తి పంట పండించిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయటం ఏమాత్రం సరైనది కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.