‘స్పిరిట్ మీడియా’ను స్థాపించి ఇప్పటికే పలు మూవీలను నిర్మించిన రానా దగ్గుబాటి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నటుడు మనోజ్ బాజ్పాయ్, దర్శకుడు బెన్ రేఖీ కాంబోలో రాబోతున్న మూవీని రానా నిర్మించనున్నాడట. దీన్ని భారీ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ రచయిత అరవింద్ అదిగ రాసిన ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’ ఆధారంగా తెరకెక్కనుంది.