ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. వీరిద్దరికీ సంబంధించిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ వీరిద్దరినీ విచారించింది. తాజాగా వీరి ఆస్తులను జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.