TPT: చెరువుకు గండి పడిన వెంటనే పోలీసులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయడంతో ప్రాణ నష్టం జరగలేదని తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు రాయలచెరువు ముంపు ప్రాంతాల్లో SP గురువారం పర్యటించి, బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. అయితే ఉదయం 5 గంటల సమయంలో గండి పడింది అని, దాదాపు 500 ఇళ్లు నీటమునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించామని పేర్కొన్నారు.