WGL: నెక్కొండ మండల కేంద్రంలోని రెడ్ల వాడ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావు హరీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని పేర్కొన్నారు.