SKLM: ఆమదాలవలస పట్టణంలో ఏపీ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహజ సేంద్రీయ వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులు ఈ కేంద్రం ద్వారా ప్రజలకు అందుబాటులో వస్తాయన్నారు. వినియోగదారులకు నాణ్యమైన గిరిజన ఉత్పత్తులు అందించాలన్నారు.