JN: జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రాలకు వచ్చిన మరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు.