W.G: చేనేత కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైన చేనేత పరిశ్రమ కార్పొరేట్ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకుందన్నారు. అనంతరం కలెక్టర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు.