MBNR: జిల్లాను అభివృద్ధి చేయడం ఎలాగో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి రూ. 824 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు.