MNCL: ప్రజల వద్ద కొని అక్రమంగా నిలువ చేసిన PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు SI భాస్కర రావు తెలిపారు. కన్నెపల్లి మండలం సురజాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ తన ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశాడనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.