TG: పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది. సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఇనీషియేటివ్ అవార్డు హైదరాబాదుకు లభించింది. స్థిరమైన నగర రవాణా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు కేంద్రం ప్రకటించింది.