GNTR: మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అబ్దుల్ బాషా అనారోగ్యంతో బాధపడుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన మంజూరు చేశారు. ఈ మేరకు సంబంధిత చెక్కును తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నిన్న బాషా కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో వారు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.