TG: పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత అంశంపై ఇవాళ రెండో రోజు స్పీకర్ విచారణ కొనసాగనుంది. నిన్న తెల్లం వెంకటేశ్వర్లు, సంజయ్ పిటిషన్లపై విచారణ చేయగా.. ఇవాళ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పిటిషన్లపై విచారణ జరగనుంది. వచ్చే 12, 13 తేదీల్లో మరో విడత విచారణ నిర్వహించనున్నారు. కాగా, ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయని విషయం తెలిసిందే.