నాసా – ఇస్రో సంయుక్తంగా తయారు చేసిన నిసార్ ఉపగ్రహం నేటి నుంచి ఆపరేషన్లోకి ప్రవేశిస్తోంది. ఇది ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని స్కాన్ చేసి.. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల డేటాను అందించనుంది. అంతేకాకుండా వాతావరణ పరిశీలన, భూకంపాలతో పాటు ప్రకృతి పరిశోధనలో కీలక సహాయకంగా ఉంటుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఈ నిసార్ ఉపగ్రహం కాలపరిమితి 3-5 సంవత్సరాలు.