KRNL: ఆటోలు కళాశాల, స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, తాగి నడపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.