AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మార్చారని వస్తున్న వార్తలపై సీఎంవో క్లారిటీ ఇచ్చింది. 2047-స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని స్పష్టం చేసింది.