AP: తిరుపతి జిల్లా గుడిమల్లం పరశురామేశ్వరాలయంలోని శివలింగం.. దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగమని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.