SKLM: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం నుంచి అధికారులతో వర్చువల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. సుపరిపాలనే లక్ష్యంగా రూపొందించిన 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని దిశ నిర్దేశం చేశారు.