VSP: విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్‌కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.