SKLM: వందేమాతరం జననీ గీతం పుట్టి 150 ఏళ్లైన ఈ చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలందరికీ గర్వకారణమని నరసన్నపేట ఎమ్మెల్యే రవణమూర్తి అన్నారు. పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు.