KNR: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్.. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలిచారు. జిల్లాలోని 4,847 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఆయన తన జీతం నుంచి చెల్లించారు. రూ. 5,45,375 విలువైన చెక్కును కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగా కృష్ణారెడ్డి ద్వారా కలెక్టర్కు అందజేశారు.