CTR: గుడిపాల మండలం ఎ.ఎల్.పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక వేడుకల్లో MLA గురజాల జగన్మోహన్, ఆయన తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా నూతన ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆలయ మర్యాదలతో సన్మానించి, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.