SKLM: జిల్లాలో ప్రముఖ ఆలయాల వద్ద జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కార్తీక మాసం మూడో సోమవారం పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయాన్ని డీఎస్పీ వివేకానంద సందర్శించారు. అనంతరం ఆలయ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.