GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తాడికొండ మండలం లాంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి రానున్నారు. సీఎం షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 3:50 గంటలకు సచివాలయం నుంచి హెలికాప్టర్లో లాం చేరుకుంటారు. అక్కడ జరిగే ఎన్జీ రంగా జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.