భారత్ తరఫున ఇప్పటికే ఎన్నో పతకాలు, రికార్డులు సృష్టించిన యువ పారా ఆర్చర్ శీతల్ దేవి మరో అరుదైన ఘనతను అందుకుంది. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడేందుకు అర్హత సాధించింది. సాధారణ ఆర్చర్లతో జట్టులో ఓ పారా ఆర్చర్ చోటు సంపాదించడం ఇదే తొలిసారి. శీతల్ 2 చేతులూ లేకున్నా కాళ్లతోనే లక్ష్యాన్ని ఛేదిస్తున్న సంగతి తెలిసిందే.