VZM: కొత్తవలస విశాఖ వెళ్లే ప్రధాన రహదారి మంగళపాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారు. దీనిమీద పిర్యాదు అందడంతో స్థానిక తహసిల్దార్ అప్పలరాజు, రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు సిబ్బందితో వెళ్ళి చదును చేసిన స్థలాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించబోమని కబ్జాదారులను హెచ్చరించారు.