రోజూ ఉదయాన్నే నడవటం చాలా మందికి అలవాటు. కొందరు అరగంట సేపూ ఏకబిగిన నడిచేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఆయుష్షు పెంచుకుంటున్నారట. ఎందుకంటే.. ఆగకుండా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు నడిచే వారికి గుండెజబ్బు, అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద రోజుకు సుమారు అరగంట సేపు నడిచేలా చూసుకోండి.