నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో శుక్రవారం లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు – విశేష రుద్రహెమం, 10 గంటలకు 108 మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.