VSP: భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు.