మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య ముక్కు కోసి.. భర్త జైలు పాలయ్యాడు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుందని అనుమానంతో.. వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నిన్న తన భార్య ముక్కును కోపంలో కోసేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తను అరెస్టు చేశారు.