PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల మృతి చెందిన 8 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు నిన్న పార్టీ కార్యాలయంలో రూ.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.