VZM: కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్బంగా ఎస్.కోట మండలం రాజీపేట గ్రామంలో ఉన్న శ్రీ గాయత్రీ శాంభవి నగరి ఆకాశ దీపం ప్రజ్వలన కార్యక్రమానికి రాష్ట్రమంత్రి అచ్చెంనాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.