కోనసీమ: గౌతమి గోదావరి తీరాన ప్రముఖ శైవ క్షేత్రం కోటిపల్లి గౌతమి గోదావరి తీరంలో గోదావరి పౌర్ణమి హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రఖ్యాత కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి హారతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.