JGL: జగిత్యాల రూరల్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పరవశించిపోయారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.