SKLM: ఎచ్చెర్ల మండలం తోటపాలెంలో ఉన్న తన నివాసంలో జనసేన నాయకులతో ఇవాళ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కష్టపడి పని చేస్తే పదవులు మిమ్మల్ని వెతిక్కుంటూ వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.