KMM: ఖమ్మం జిల్లా తిరువూరు పట్టణ శివారు ముత్తగూడెం పెట్రోల్ బంక్ ఎదురుగా ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న గేదెని తప్పించబోయి అదుపు తప్పిన కారు బోల్తా పడినట్లు తెలిపారు. భద్రాచలానికి చెందిన కారు తిరువూరు ఒక ప్రైవేట్ హాస్పటల్లో జాయిన్ అయిన భార్యా భర్తలు తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.