SBI తమ ఖాతాదారుల కోసం ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ పాలసీని అందిస్తోంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లించాలి. రోజువారీగా లెక్కిస్తే రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాముకాటు మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.