SRPT: సమాజంలో సైబర్ మోసాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల నివారణలో నేటి పౌరులు సైబర్ మోసాల నివారణ వారియర్స్‌గా పనిచేయాలన్నారు.