ATP: తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం డీఎస్పీ కార్యాలయంలో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీకి వివరించారు.