ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలో ఇవాళ పోలీస్ బృందాలతో సీఐ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ప్రతి స్కూల్ బస్సులో డ్రైవర్స్‌తో పాటు విద్యార్థులకు కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాదన్నారు.