ADB: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి విద్యను బోధించాలని ఉట్నూర్ ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని ఈఎంఆర్ఎస్ పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతిగదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగాన్ని బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.