GNTR: పొన్నూరు పట్టణంలోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సుమారు రూ. 20,80,775 విలువైన 38 కిలోల వెండి ఆభరణాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.