GDWL: గద్వాల పట్టణంలోని గురువారం బాలికల పాఠశాల ముందు గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన రూ. 5వేలు పడిపోయాయి. అదే దారిలో వస్తున్న ముగ్గురు మహిళలకు ఆ డబ్బులు దొరకగా, వారు వెంటనే పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీని చాటుకున్న మహిళలను ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు అభినందించాడు.