WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గోదాములను జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా మార్కెట్ యార్డు లోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించ రికార్డులు పరిశీలించారు.