TPT: చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి, పుంగనూరు RTC డిపో మేనేజర్లతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి నుంచి చంద్రగిరి ద్వారా పుంగనూరు వైపు వెళ్తున్న బస్సులపై రహదారి సమస్యల కోసం ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. దీంతో పల్లెవెలుగు బస్సులు సర్వీస్ రోడ్డులో నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.